చైర్మన్ మరియు మ్యానెజింగ్ డైరెక్టర్
వ్యాపారానికి దిశానిర్దేశం చేయడంలో మరియు వ్యూహాత్మక అంతర్దృష్టిని అందించటానికి నాయకత్వ బృందంతో సన్నిహితంగా ఉంటూ, అనుభవం, నైపుణ్యం మరియు విజయానికి సంబంధించిన నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి, వ్యవసాయ రంగములో అత్యధిక మరియు సేంద్రీయ దిగుబడులను అందించాలని నిత్యనూతన సాంకేతికతలను అభివృద్ధి చెందిస్తూ, కొత్త శిఖరాలను అధిరోహిస్తూ విజయానికి చిరునామాగా నిలిచారు లీడ్ క్రాప్ సైన్స్ ప్రై.లి. మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రీ వినోద్ లాహోటి గారు. ఎగ్జిక్యూటివ్ MBA చదువును పూర్తి చేసుకొని వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆరోగ్యవంతమైన నేల మరియు మొక్కల పోషకాహార ఆధారిత ఉత్పత్తుల పరిశోధన, తయారీ, మార్కెటింగ్ ద్వారా అవశేషాలు లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారు. వ్యవసాయాన్ని అవశేష రహితముగా సాధించేందుకు సేంద్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని, సేంద్రీయ పద్ధతుల ద్వారా దిగుబడిని పెంచాలన్నది తన యొక్క ధృఢమైన విశ్వాసము. పోషకయుత విషరహిత సాత్విక ఆహారపు దిగుబడి వినియోగాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
బ్రహ్మకుమారీస్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ జీవితకాల సభ్యులు శ్రీ వినోద్ లాహోటీ గారు. బ్రహ్మకుమారీస్ సంస్థ సహకారముతో యోగిక వ్యవసాయాన్ని అమలుచేసారు. సానుకూల తరంగాలను మన పొలాలకు అందించటం ద్వారా సాత్విక దిగుబడులను పొందవచ్చును.
వృత్తిపరమైన విజయాన్ని సాధించినందుకు మరియు తక్కువ వ్యవధిలో సామాజిక సంక్షేమానికి వారి సహకారం కోసం ఇతర జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.
1. "భారత్ జ్యోతి అవార్డు"-2017
2. “లీడర్ విత్ స్ట్రాటజిక్ విజన్ అవార్డు” – 2019
3. USA లో జరిగిన IMRC 2014 ఈవెంట్ సందర్భంగా కమ్యూనిటీకి అత్యుత్తమ సహకారం అందించినందుకు అవార్డు
4. అటల్ జనసేవ శిఖర్ సమ్మాన్ అవార్డు - 2021
(న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన భారతరత్న స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రదానం చేశారు)