Optimization

వ్యవసాయ రంగములో ప్రతికూల పరిస్థితులలో సహితం వ్యాధి నిరోధక సామర్థ్యం మరియు అధిక దిగుబడిని ప్రోత్సహించే వ్యవసాయ సేంద్రీయ ఉత్పత్తుల యొక్క శ్రేణిని అందిస్తుంది లీడ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్.

Structure

లీడ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిత్యనూతన సాంకేతిక పరిజ్ణానముతో అను నిత్యం వ్యవసాయ రంగములో నూతన ఉత్పత్తులను అందించటం ద్వారా దేశపు ఆర్థిక పురోగతికి మా వంతు సహకారం అందించటాన్ని మా లక్ష్యంగా నిర్ధారించుకొన్నాము.

Productivity

ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోషకయుత, విషరహిత మరియు సాత్వికమైన ఆహార ధాన్యాలను రైతులు దిగుబడి చేయాలన్న సంకల్పముతో ప్రతి దశలో మొక్కలకు అవసరమైన పోషకాలను సరైన సమయములో సరైన మోతాదులో సరైన పద్ధతిలో వివిధ విధానాల ద్వారా పంటలకు పోషణను అందించాలన్నది మా ప్రయత్నము

Workflow

సహజసిద్ధమైన వనరుల ద్వారా తయారైన ఈ సేంధ్రీయ ఉత్పత్తులు పర్యావారణానికి అనుకూలముగా ఉన్నాయి. సేంధ్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఈ భావి తరానికి ఇదే విధంగా నిత్య నూతన ఉత్పత్తులను అందిస్తామన్నది మా యొక్క సంకల్పము.

లీడ్ క్రాప్ ఉత్పత్తులు  

లీడ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిత్యనూతన సాంకేతిక పరిజ్ణానముతో అను నిత్యం వ్యవసాయ రంగములో నూతన ఉత్పత్తులను అందించటం ద్వారా దేశపు ఆర్థిక పురోగతికి మా వంతు సహకారం అందించటాన్ని మా లక్ష్యంగా నిర్ధారించుకొన్నాము.

భూసార అభివృద్ధి ప్రేరకాలు/ఉత్పత్తులు 

భూసార అభివృద్ధి ప్రేరకాలు అన్వేషణ

Nano Technology Concentrated Micro Nutrients
అధిక పనితీరు గల బయో ఎరువులు 

అత్యధిక పనితీరుకల బయో - ఎరువులు అన్వేషణ

Nano Technology Complete Nutrient Fertilizers
వినూత్న టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక పోషకాలు మరియు జీవ ఉత్ప్రేరకాలు - జీవ ఉత్ప్రేరకాలు

అన్వేషణ

Nano Technology Specialty Nutrients and Bio-Stimulants
సూక్ష్మ పోషకాలు

సూక్ష్మ పోషకాలు అన్వేషణ

Nano Technology Micro Nutrient Fertilizers
నీటిలో సులభముగా కరిగే ఎరువులు

హ్యాపీ ఫర్ట్ ఉత్పత్తుల శ్రేణి -స్థూల పోషకాల ఎరువులు అన్వేషణ

Nano Technology Water Soluble Fertilizers
వ్యవసాయ ఉత్పత్తుల పనితీరు ఉత్ప్రేరకాలు 

ఉత్పత్తుల పనితీరు ఉత్ప్రేరకాలు అన్వేషణ

Performance Enhancer
అధిక పనితీరు గల కీటకనాశకాలు

అత్యధిక పనితీరుకల కీటక నాశకాలు అన్వేషణ

High Performing Insecticide
అవశేషరహిత వినూత్న ఉత్పత్తులు

అవశేషరహిత వినూత్న ఉత్పత్తులు అన్వేషణ

High Performing Fungicide

పోషణయుత విషరహిత సాత్విక ఆహారం

పోషకయుత ఆహారం : మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థ యొక్క శ్రేయస్సు కు కీలక అంశం-ఆహారం. అందుకే మనం తీసుకునే ఆహారం అవసరమైన పోషకాలతో కూడిఉండటం ప్రస్తుత సమయములో పెద్ద సవాలు. ప్రతి దశలో మొక్కలకు అవసరమైన పోషకాలను సరైన సమయములో సరైన మోతాదులో సరైన పద్ధతిలో వివిధ విధానాల ద్వారా పంటలకు పోషణను అందించాలన్నది మా ప్రయత్నము.

విషరహిత ఆహారం : వర్తమాన కాలములో మనము తీసుకొనే ఆహారము అధిక శాతము హానికరమైన రసాయనాలతో కూడి ఉంటున్నాయి. పోషక అవసరాలను, ప్రతి దశలోను పోషకాల లభ్యతను పెంపొందిచుట అత్యావశ్యకము, తద్వారా రసాయనాల వాడకము పరిమితం చేసి, రైతులు విషరహిత దిగుబడులు సాధించేలా చేయడమే మా ప్రధాన లక్ష్యం!

సాత్విక ఆహారం : ప్రాచీన భారతదేశంలోని వ్యవసాయ పద్ధతుల నుండి నిరూపించబడిన వాస్తవం ఏమిటంటే పొలాలలో సానుకూల తరంగాలను అందించటము ద్వారా మన ఆహారము సాత్వికముగా రూపుదిద్దుకొంటుంది. ఫలస్వరూపముగా మన శరీరాన్ని మరియు మన మనస్సును తదనుగుణంగా సాత్వికముగా మార్చుతాయి. సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మానవులకు వ్యక్తిగతంగా మరియు సామాజికముగా కూడా చాలా ప్రయోజనకరము మరియు నేటి యుగానికి అవసరము కూడా.

పంటల ఎంపిక

సంపూర్ణ పోషకాల ప్యాకేజీ

నూనె గింజలు

నువ్వులు, వేరుశనగ, ఆముదం , కుసుమ, పొద్దుతిరుగుడు.. explore

Geolife Choose Your Crop
దుంప జాతి పంటలు

బంగాళ దుంపలు, క్యారట్, బీట్ రూట్,
ముళ్ళంగి, చామదుంప.. explore

Geolife Choose Your Crop
కూరగాయలు 

వంకాయ, క్యాబేజీ,  కాలిఫ్లవర్, క్యాప్సికం, బెండకాయ .. explore

Geolife Choose Your Crop
పండ్లు 

అరటి పండ్లు, మామిడి పండ్లు, డ్రాగన్ పండ్లు, నిమ్మకాయ..  explore

Geolife Choose Your Crop

The Farm People

- ద ఫార్మ్ పీపుల్ యాప్‌ ద్వారా మీ అన్ని పంటల వివరాలను తెలుసుకోవటానికి ఇది ఒక సదావకాశం

ఈ యాప్ ను త్వరగా డౌన్ లోడ్ చేసుకోండి..

- వివిధ రకాల పంటల సమస్యలకు ఒకే ఒక పరిష్కారము! అవును ఇది నిజమే..!!
ఈ యాప్ ను తక్షణమే డౌన్ లోడ్ చేసుకోండి..

ఇంతకు ముందు వేరే ఉత్పత్తులను వాడేవాళ్ళము. అప్పుడు ఆశించిన దిగుబడిని పొందలేకపోయాం. కానీ లీడ్ స్టార్ ఉపయోగించినప్పటి నుండి వేరు వ్యవస్థ మెరుగుపడి రోగ నిరోధక శక్తి పెరిగి అధిక పిలకలు వచ్చాయి. తద్వారా మంచి ఎదుగుదలతో ఆశించిన దిగుబడిని పొందగలిగాను. లీడ్ క్రాప్ సైన్స్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

మురళి
లీడ్ స్టార్, వరి

సంపూర్ణ పోషకాల ఉత్పత్తులను ప్రతి దశలో ఉపయోగించి తిరుగులేని దిగుబడిని పొందగలిగాను. ఈ కిట్ వాడని పొలం లో కేవలం 800 కేజీలు మాత్రమే పొందాను. ఈ కిట్ వాడిన పొలం లో 2000 కేజీల దిగుబడిని పొందగలిగాను. ఈ అద్భుత ఫలితాలు కేవలం సంపూర్ణ పోషకాల ఉత్పత్తులతోనే సాధ్యం అయ్యాయి కాబట్టి నేను ప్రతి ఒక్క రైతుకు ఈ సంపూర్ణ పోషకాల ప్యాకేజిని వాడమని చెప్తాను.

వలి
సంపూర్ణ పోషకాల ప్యాకేజి, బీర

లీడ్ క్రాప్ వారి సంపూర్ణ పోషకాల కిట్ ని ఇచ్చారు అది వాడిన తరువాత పంటలో కాపు బాగా వచ్చింది. మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచి మంచి ఎదుగుదలకు తోడ్పడింది మరియు మొదటి కాపు లాగా రెండో కాపు కూడా వచ్చింది. ఈ కిట్ ను వాడినందుకు ఆశించిన దిగుబడిని పొందాను. అలానే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సంపూర్ణ పోషకాల ప్యాకేజిని వాడినందుకు వేరే పంటలలో వచ్చిన కంప్లైంట్స్ నా పంటలో రాలేదు.

చంద్రకాంత్
సంపూర్ణ పోషకాల ప్యాకేజి, మిరప

సంపూర్ణ పోషకాల ఉత్పత్తులు వాడిన తర్వాత కాపు బాగా వచ్చింది. ప్రతి దశలో ఈ కిట్ లోని ఉత్పత్తులను వాడాను. ఎలాంటి చీడపీడల సమస్య రాలేదు. పంట ఆరోగ్యంగా మంచి ఎదుగుదల ఉంది. ఈ కిట్ వాడినందుకు విజయవంతం (సక్సెస్) అయ్యాను. ఈ కిట్ ను ఇచ్చినందుకు లీడ్ క్రాప్ వారికి ధన్యవాదాలు.

పరుశురాం
సంపూర్ణ పోషకాల ప్యాకేజి, పత్తి

లీడ్ క్రాప్ సైన్స్ వారి సంపూర్ణ పోషకాల ప్యాకేజీని టమాట పంటలో ఉపయోగించాను. ఇంతకు ముందు కూడా మంచి ఎదుగుదలతో పాటు అధిక నాణ్యమైన దిగుబడిని పొందాను. వాడని చేను కంటే వాడిన చేనులో మంచి దిగుబడి వచ్చింది. రెండవ కోతలో కూడా మంచి బరువు, సైజు, నాణ్యత గల 2 టన్నుల టమాటా కాయలు దిగుబడి వచ్చింది.ఇదంతా లీడ్ క్రాప్ సైన్స్ కంపెనీ వారి ఉత్పత్తుల కారణముగా సాధ్యమైంది. 

గంగాధర్
సంపూర్ణ పోషకాల ప్యాకేజీ, టమాట 

నేను నా 45 ఎకరాల పొలంలో ఖర్భుజా సాగు చేస్తున్నాను. నాకు ఉన్న45 ఎకరాలలో కేవలం 2 ఎకరాలకు మాత్రమే లీడ్ క్రాప్ సైన్స్ వారి సంపూర్ణ పోషకాల ప్యాకేజిని దశలవారీగా పంట 10 రోజుల సమయం నుండి చివరి వరకు వాడాను. మా చేను చాలా అద్భుతంగా బ్రాహ్మాండముగా ఎదిగింది, తీగ బాగా సాగి, అధిక పూత, పిందెలతో, మంచి నాణ్యమైన బరువైన కాయలు వచ్చాయి. సంపూర్ణ పోషకాల ప్యాకేజీని వాడిన 2 ఎకరాలలో 18 టన్నుల దిగుబడిని పొందాను.ఇంచుమించుగా వాడిన పొలంలో 2-3 టన్నులు వ్యత్యాసం ఉంది.

బసవరాజు
సంపూర్ణ పోషకాల ప్యాకేజీ, ఖర్భుజా 

మా పత్తి చేనులో పూత సమయంలో లీడ్ క్రాప్ సైన్స్ వారి ఆక్సిజన్ 1 గ్రా. హ్యాపీ న్యానో 50 గ్రా. వాడాను. మొక్కలు ఏపుగా పెరిగాయి. కొమ్మ బాగా సాగి, గూడ(పూత) అధికంగా వచ్చి, పూత రాలడం తగ్గింది. చేను పచ్చగా, మంచి మెత్తదనం కనిపించింది. మావి గుంత నెలలు, ఈ నేలలలో ఈ ఉత్పత్తులు వాడడం వలన ఆకులలో ఎరుపుదనం కూడా తగ్గింది మంచి పచ్చదనం వచ్చింది. అందరూ తప్పకుండ ఎకరానికి ఆక్సిజన్ 1 గ్రాము, హ్యాపీ న్యానో 50 గ్రాములు పూత దశలో ఉపయోగించి అధిక పూత,పిందెలను తద్వారా నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు.

రవీందర్ రెడ్డి
ఆక్సిజన్ & హ్యాపీ న్యానో, పత్తి 

నేను మినుము పంటలో లీడ్ క్రాప్ సైన్స్ వారి సంపూర్ణ పోషకాల ప్యాకేజీని దశల వారీగా వాడి అధిక లాభాలను పొందాను. కొమ్మల సంఖ్య పెరిగింది, అధిక పూత, పిందెలతో పాటు నాణ్యమైన దిగుబడిని కూడా పొందాను. వాడని పొలంలో 6.5 క్వింటాలు, వాడిన పొలంలో 8 క్వింటాలు దిగుబడి వచ్చింది. నాతోటి రైతులు ఈ ప్యాకేజీని వాడి వారు కూడా మంచి దిగుబడులను పొందాలని ఆశిస్తున్నాను. కంపెని వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

దుర్గ విజయ్
సంపూర్ణ పోషకాల ప్యాకేజీ, మినుములు

నేను మా వరి చేనులో లీడ్ క్రాప్ సైన్స్ వారి లీడ్ స్టార్ 250గ్రాములు, బ్యాక్టోగ్యాంగ్ 500 మి.లీ. ఇసుకలో కలిపి ఒక ఎకరానికి పలుచగా చల్లాను.10 రోజుల తరువాత చూసాను ఇంతకు ముందు వాడిన మందుల కంటే ఈ లీడ్ క్రాప్ సైన్స్ వారి మందులు నాకు చాలా మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇంచుమించుగా వాడిన పొలములో వాడని పొలము కంటే 12 - 15 వరకు ఎక్కువ పిలకలు వచ్చాయి. చీడపీడలు లేకుండా ఆరోగ్యవంతముగా, పచ్చగా చేను నాణ్యతగా కనబడుతుంది. రైతులకు అధిక దిగుబడినిచ్చే మంచి ఉత్పత్తులు ఇస్తున్నందుకు లీడ్ క్రాప్ సైన్స్ ప్రై.లి. వారికి నా ప్రత్యేక దన్యవాదాలు.

రామ లింగయ్య
లీడ్ స్టార్ & బ్యాక్టోగ్యాంగ్, వరి

నేను వరి చేనులో లీడ్ క్రాప్ సైన్స్ వారి సంపూర్ణ పోషకాల ప్యాకేజీని వాడాను. వాడని చేనులో 12 పిలకలు వచ్చాయి. కిట్ వాడిన చేనులో 26 పిలకలు వచ్చాయి. వాడిన చేనులో గంట, పచ్చదనం, అధిక పిలకలు వచ్చాయి. పురుగుల దాడి కూడా తక్కువగా ఉన్నది. అందరూ రైతులు కూడా ఈ ప్యాకేజీని ఉపయోగించి అధిక లాభాలను పొందాలని ఆశిస్తున్నాను. నేను వ్యవసాయం చేస్తున్న దగ్గర నుండి ఇంత అధిక పిలకలు మరియు దిగుబడులు ఎప్పుడు రాలేదు. ఇంత ఉపయోగకరమైన ఉత్పత్తులు అందరూ వాడాలని ప్రయత్నిస్తాను.

గొరిగే మహేష్
సంపూర్ణ పోషకాల ప్యాకేజీ, వరి

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture